Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్, రాంనగర్, విద్యానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అడిక్‌మెట్, కవాడిగూడ, దోమలగూడ, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, వారాసిగూడ, పారడైజ్, బన్సిలాల్ పేట్, రాంగోపాల్ పేట్ డివిజన్ ప్రాంతంలో వడగండ్ల వాన దంచికొట్టింది. కుత్బుల్లాపూర్, సూరారం, దూలపల్లి, జీడిమెట్లలో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బన్సీలాల్‌పేటలో 3.1 సెం.మీ, చిలకలగూడలో 2.9 సెం.మీ, గొల్కొండలో 2.7 సెం.మీ, మోండమార్కెట్లో 2.7 సెం.మీ, ఓయూలో 2.1 సెం.మీ, రామంతాపూర్‌లో 2.0 సెం.మీ, వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు: మరోవైపు తమిళనాడు-కర్ణాటక మీదుగా ఉత్తరాది వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించింది. రాగల మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈరోజు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్,.. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
ఇవీ చదవండి:
- 'పది' పేపర్ లీకేజీ.. ప్రభుత్వం రాసిన స్క్రిప్టే: MLA రఘునందన్‌రావు
- బీజేపీకి పని తక్కువ ప్రచారమెక్కువ : మంత్రి హరీశ్ రావు
- పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదన్నారు: బండి సంజయ్ భార్య
- 110 కిలోల బంగారం-వెండితో అంజన్న ప్రతిమ.. 54 అడుగుల ఎత్తైన విగ్రహం ఆవిష్కరణ
- పాము తల కొరికి వెకిలి చేష్టలు.. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దారుణం.. ముగ్గురు అరెస్ట్