Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, మైత్రీవనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో కాలువను తలపించింది. మాదాపుర్, రాయదుర్గం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, గండిపేట, ఉప్పరపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చదవండి: 'గులాబీ కూలీ పేరుతో కేసీఆర్ అక్రమాలు.. ఆధారాలు, ఆదేశాలున్నా చర్యలేవీ'
తొమ్మిది మందిని చంపిన పులి.. గురిచూసి మట్టుబెట్టిన షార్ప్ షూటర్లు!