Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. రెండో రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, ట్రూప్‌బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్ సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైస్ , చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, నెరేడ్‌మెట్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, మీర్‌పేట్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వెల్లడించారు.
ఇది సముద్రమట్టానికి 3.1కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు. మరొక ఉపరితల ఆవర్తనం ఈశాన్య దాని అనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ ఒకటిన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలియజేశారు.
ఇవీ చదవండి: ఏపీని మూడు రాష్ట్రాలు చేస్తే.. ఆ ముగ్గురూ ముఖ్యమంత్రులు కావొచ్చు: జగ్గారెడ్డి
సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌లో చూడాలా? ఈ లింక్‌పై క్లిక్ చేయండి!