రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడింది. హన్మకొండ, వరంగల్ , కాజీపేటల్లో కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి జాతీయరహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో 2గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జైనూర్ మండలం కిషన్ నాయక్ తండాలో పిడుగుపడి మహిళ మృతిచెందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ లాంఛనాలతో శనివారం బాలు అంత్యక్రియలు