ETV Bharat / state

భాగ్యనగరంలో ఉదయం నుంచి భారీ వర్షం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసిముద్దైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

heavy-rain-in-hyderabad
ఎడతెరిపిలేని వర్షం... నగర వాసులను చేస్తోంది అతలాకుతలం
author img

By

Published : Oct 12, 2020, 12:36 PM IST

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతో నగరమంతా తడిసి ముద్దయింది. సైదాబాద్​, సరూర్​నగర్, చంపాపేట, సంతోష్ నగర్​, దిల్‌షుఖ్‌నగర్, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లిలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

ఎడతెరిపిలేని వర్షం... నగర వాసులను చేస్తోంది అతలాకుతలం

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, నాంపల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, బషీర్‌బాగ్, సుల్తాన్ బజార్‌, కోఠి, బేగంబజార్, నారాయణగూడ, హిమాయత్​నగర్, రాజేంద్రనగర్​ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చూడండి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.