హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు రహదారులపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్రజలు, వాహనచోదకులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. భాగ్యనగరంలోని ఏంజె మార్కెట్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.
రాజేంద్రనగర్, గండిపేట్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, బండ్ల గూడ, కార్వాన్లో భారీ వర్షం నమోదైంది. మలక్ పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోలు, ఎల్బీ నగర్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, బషీర్ బాగ్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
పాతబస్తీలోని ఫలక్ నామా, చంద్రయాణ్ గుట్ట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి:అమితాబ్, అభిషేక్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది