హైదరాబాద్ మహా నగరం భారీ వర్షాలతో తల్లడిల్లుతోంది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా నీటితో ప్రవహిస్తోంది. ఇళ్లలోకి చేరిన వరద నీరు. నిలిచిన విద్యుత్ సరఫరా ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షంతో జాతీయ రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, వరంగల్, విజయవాడ నుంచి భాగ్యనగరానికి రాకపోకలు నిలిచిపోయాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి. అటు వరంగల్ రహదారిపై కూడా భారీగా వదర నీరు చేరింది. వానతో పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై రాకపోకలను నిషేధించారు.
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీలో వర్ష బీభత్సం... అత్యవసర సేవల నంబర్లు ఇవే