ETV Bharat / state

WEATHER REPORT : వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన - HYDERABAD DISTRICT NEWS

గత రెండు రోజులగా వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిచ్చినా... మళ్లీ పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Heavy rain forecast
వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
author img

By

Published : Sep 11, 2021, 12:06 PM IST

మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది.

అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:RAIN IN KARIMNAGAR: వర్షపు నీరు పోయింది.. చేదు అనుభవమే మిగిలింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.