ETV Bharat / state

గోదావరికి వరద ఉద్ధృతి... ప్రాజెక్టులకు జలసవ్వడి - నీటిప్రాజెక్టులకు భారీ వరద

Huge Inflow to Irrigation Projects : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడూ... రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి భద్రాచలం వరకు ప్రాజెక్టులకు ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. గోదావరిలో వరద దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి... సీఎస్‌ను ఆదేశించారు.

Huge Inflow to Irrigation Projects
గోదావరికి వరద ఉద్ధృతి... ప్రాజెక్టులకు జలసవ్వడి
author img

By

Published : Sep 12, 2022, 9:03 PM IST

గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. SRSPకి లక్షా 78వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.... 30 గేట్ల ద్వారా లక్షా 99వేల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. కడెం జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తోంది. 72వేల 810 వేల క్యూసెక్కులు వస్తుండగా.... ఆరు గేట్లను ఎత్తి 62వేల 444 వేల క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నుంచి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 8లక్షల46వేల 710 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి 7లక్షల 90వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంటే... 66 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద పార్వతీ బ్యారేజి 60 గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత, గోదావరి పరవళ్లు తోక్కుతున్నాయి. పుష్కర ఘాట్ లను వరద ముంచెత్తింది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న ఉదయం 32 అడుగులు ఉన్న నీటిమట్టం మూడున్నర గంటలకు 43 అడుగులకు పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ , భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామబాద్ జిల్లా సాలురా వద్ద మంజీరా పోటెత్తుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 9గేట్లు తీయడంతో బోధన్ మండలం సాలూర శివారులోని మంజీరా నదిలో లోలెవల్ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ-మహారాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో.... జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని చెప్పారు. అందుకు సంబంధించి తక్షణమే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి... ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.