ETV Bharat / state

పోటెత్తిన వరదలు.. ఉగ్రరూపం దాల్చిన ప్రాజెక్టులు

author img

By

Published : Jul 13, 2022, 1:24 PM IST

రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిగా నిండి.. దిగువకు వరద ఉరకలెత్తుతోంది. భారీ ప్రవాహంతో భారీ తరహా ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతుండగా.. కొన్ని ఇప్పటికే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

పోటెత్తిన వరదలు.. ఉగ్రరూపం దాల్చిన ప్రాజెక్టులు
పోటెత్తిన వరదలు.. ఉగ్రరూపం దాల్చిన ప్రాజెక్టులు
పోటెత్తిన వరదలు.. ఉగ్రరూపం దాల్చిన ప్రాజెక్టులు

రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తోంది. ఉదయం 51 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరిలో ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తుతోంది. భద్రాచలంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. అక్కడున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్నానఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు.. దిగువన ఉన్న ముంపు మండలాల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 34 గేట్ల ద్వారా 2 లక్షల 17 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 14వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,087 అడుగుల నీటిమట్టం, 75 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మోగిన సైరన్​.. సీఎం ఫోన్..: నిర్మల్​ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ ఫ్లో 3 లక్షలుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు వద్ద సైరన్‌ మోగించారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రాజెక్ట్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్​ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డికి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం..: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి పుష్కరఘాట్లు మునిగిపోయాయి. అనంతరం రోడ్లపైకి.. ఆ తర్వాత దుకాణాల్లోకి వరదనీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వద్ద 12,10,600 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 85 గేట్లు ఎత్తి అంతేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం (సరస్వతి) బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 7,78,000 క్యూసెక్కులు.. అంతేస్థాయిలో ఔట్‌ ఫ్లో ఉంది. అక్కడ 65 గేట్లలో 62 పైకెత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద కూడా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వదర ఎక్కువగా వస్తుండటంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

గడ్డెన్నవాగు ఉద్ధృతి..: నిర్మల్ జిల్లా సారంగపూర్​ మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. 4 గేట్లు ఎత్తి 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పరివాహక ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంక్‌లు, పలు కాలనీలు నీట మునిగాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా.. ప్రస్తుతం 358.40 మీటర్ల నీరు చేరింది. భైంసా నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారితో పాటు ఆ ప్రాంతాలలోని పలు రహదారులపై ప్రాజెక్టు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు అదేవిధంగా భైంసా మండలం గుండెగావ్ వద్ద ఉన్న పాల్సికర్ రంగరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడంతో ఆ ప్రాంతంలోని గ్రామాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది.

నిండుకుండల్లా జంట జలాశయాలు..: హైదరాబాద్​ జంట జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది. ఉస్మాన్​సాగర్​కు 250 క్యూసెక్కుల వరద వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్​సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1,786 అడుగులు ఉంది. హిమాయత్​సాగర్​కు వచ్చే వరదను మూసీలోకి విడుదల చేశారు. హుస్సేన్​సాగర్​కు వస్తున్న నీటికి సమానంగా తూముల ద్వారా బయటకి వెళ్తున్నాయి.

ఇవీ చూడండి..

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ‘ఉగ్ర’ గోదావరి.. రికార్డు స్థాయిలో వరద

ఎస్సారెస్పీ 34 గేట్లు ఎత్తి నీటి విడుదల

లారీ హారన్​కు రోడ్డుపైనే యువకుల చిందులు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.