రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన లభిస్తోంది. ఎల్ఆర్ఎస్కు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 32 వేల 635 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీల నుంచి లక్షా 35వేల 705 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల నుంచి లక్షా 21 వేల 347 దరఖాస్తులు వచ్చాయి.
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 75 వేల 583 దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ రుసుము కింద సర్కారు ఖజానాకు 33. 78 కోట్ల రూపాయలు చేరింది.
ఇవీ చూడండి: రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్