రాష్ట్రంలో గత నెల రోజులుగా క్రమం తప్పకుండా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్లే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అరేబియా, బంగాళఖాతం సముద్రం మీద నుంచి ఎలాంటి తేమ గాలులు లేకపోవడంతో క్యుములో నింబస్ మేఘాలు కూడా ఏర్పడటం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దీనివల్ల వాతావరణం వేడిగా ఉంటుందని.... వడగాల్పుల ప్రభావం వల్ల మరింత వేడి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండల ప్రభావంపై వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి మీకోసం...
భానుడి భగభగలు... ఇంకా ఎన్ని రోజులో ఇలా..! - భానుడి భగభగలు... ఇంకా ఎన్ని రోజులో ఇలా..!
ఎండలు రోజురోజుకీ మండుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎండలు మరింత పెరగనున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పులు రానున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రాష్ట్రంలో గత నెల రోజులుగా క్రమం తప్పకుండా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్లే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అరేబియా, బంగాళఖాతం సముద్రం మీద నుంచి ఎలాంటి తేమ గాలులు లేకపోవడంతో క్యుములో నింబస్ మేఘాలు కూడా ఏర్పడటం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దీనివల్ల వాతావరణం వేడిగా ఉంటుందని.... వడగాల్పుల ప్రభావం వల్ల మరింత వేడి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండల ప్రభావంపై వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి మీకోసం...
TAGGED:
HEAT WAVES