లాక్డౌన్ కారణంగా పని లేక ఆకలితో అలమటిస్తున్న పలువురు పేదలకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నాడు రామంతాపూర్‌కు చెందిన కార్తీక్ సూర్య, అతని స్నేహితులు. ఆటోపై ఆహారాన్ని తీసుకెళుతూ సుమారు 600 నుంచి 800 మందికి అన్నదానం చేశారు.
లాక్డౌన్ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరం కొనసాగిస్తున్నట్లు కార్తీక్ సూర్య తెలిపాడు. ప్రతిరోజు అన్నం, పప్పు, కోడిగుడ్లు, బట్టర్ మిల్క్‌తో పాటు ఆదివారం నాన్ వెజ్ అందిస్తున్నట్లు వివరించాడు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?