ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంటకి చెందిన రామక్కకు 3 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల్లిని తీసుకుని ఆమె కుమారుడు రవి గురువారం రోజను ఆటోలో వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా ఆటో కళ్యాణదుర్గంలోకి రాలేదు. చేసేదేమీ లేక మాతృమూర్తిని వీపున ఎత్తుకుని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల... చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వెనుదిరిగారు.
ఇవీ చదవండి....కరోనా రోగికి 'ప్రైవేటు' వైద్యం...గుంటూరులో ఘటన