ETV Bharat / state

నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటోంది - నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటోంది వార్తలు

బాల్వాడీ ఉపాధ్యాయులకు శాశ్వత ఉద్యోగుల్లా కనీస వేతనం చెల్లించాల్సిందేనని... ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. శాశ్వత ఉద్యోగాల కల్పనలో విఫలమైన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం...నిరుద్యోగితను అవకాశంగా తీసుకొని కనీస వేతనాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు...ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిలో నియామకాలు చేస్తోందని అభిప్రాయపడింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించే విషయం, ఉద్యోగాల కల్పన బాధ్యత నుంచి తప్పుకోవడం..బాధ్యతను విస్మరించడమేనని ఆ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది.

ap news
ap news
author img

By

Published : May 11, 2021, 10:29 PM IST

శాశ్వత ఉద్యోగుల్లాగే రోజుకు 8 గంటలకు పైగా విధులు నిర్వహిస్తున్న బాల్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించకపోవడం వివక్ష చూపడమేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. బాల్వాడీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉద్యోగుల్లా కనీస వేతనాలు చెల్లించాలని..విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించింది. అయితే వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాల్సిందిగా ఆదేశించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. నిరుద్యోగ యువత పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం..వివిధ మార్గాల్లో వారిని ఎంపిక చేసి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండటాన్ని తప్పుబట్టింది.

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా నియమితులైన వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ..గతేడాది డిసెంబర్‌లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మురికివాడల్లో వయోజన విద్యను ప్రోత్సహించడం, మూడు నుంచి ఐదేళ్ల పిల్లలకు చదువు చెప్పడం, బడి మానేయకుండా చూడటం బాల్వాడీ టీచర్ల విధి. అలాగే ఏపీ ప్రభుత్వం అప్పగించిన ఇతర పనులు చేసినా అదనపు పారితోషకం కూడా చెల్లించేవారు కాదని.. శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశతోనే ఇప్పటికీ పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. క్రమబద్ధీకరణ, కనీస వేతనంపై తమ వినతిని తోసిపుచ్చిన అధికారులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2017 జూన్ 19న ప్రొసీడింగ్స్ జారీ చేశారని వాపోయారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు...పిటిషనర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బాల్వాడీ టీచర్లుగా తీసుకున్నట్లు చెప్పారు. వారి ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని...2016లో పారితోషకాన్ని 6 వేల 700 కు పెంచామని వివరించారు.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ అఫిడవిట్‌పై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి...రికార్డుల ప్రకారం మహావిశాఖ మహిళా సంక్షేమ సంఘం ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో పిటిషనర్లు నియమితులయ్యారని గుర్తుచేశారు. అందువల్ల వారు క్రమబద్ధీకరణ కోరలేరని తేల్చిచెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం పొందేదుకు అర్హులని స్పష్టంచేశారు. రోజుకు 8 గంటలు పనిచేయించుకుంటూ, నెలకు 6వేల 700 రూపాయలు చెల్లించడం శ్రమ దోపిడీతోపాటు రాజ్యాంగ హక్కును హరించడమేనన్నారు. పిటిషనర్లు హుందాగా జీవించాలని కోరుకుంటారని...జంతు జీవన విధానాన్ని కాదని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇదీ చదవండి ' ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.