దీపావళి వెలుగులతో కరోనా మహమ్మారి అంతమవ్వాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించానని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు (Haryana state governor bandaru dattatreya). చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న దత్తాత్రేయ.. ప్రత్యేకంగా పూజలు చేశారు.
యునిసెఫ్, యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులకు హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యంగిస్తాన్ సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను దత్తాత్రేయ అభినందించారు.
కొవిడ్ మహమ్మారిపై సుమారు 80శాతానికి పైగా విజయాన్ని సాధించాము. అయినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలి. దేశంలో వందకోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. చిన్నపిల్లలకు కూడా త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది. ఈ దీపావళి పండుగ ప్రజలందరికీ సుఖ, శాంతులు కలిగించాలి, దీపావళి కాంతులు కొవిడ్ మహమ్మారిపై విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థించాను. బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్.
ఇదీ చూడండి: SEED CRACKERS: మార్కెట్లోకి కొత్త సరుకు... పర్యావరణహిత బాణసంచా