ETV Bharat / state

HARITHAHARAM: 'హరితహారంలో పోలీస్​ శాఖ భాగం కావడం సంతోషం' - haritha haram programme at medipalli rachakonda commissionarate

హరితహారంలో భాగంగా మేడిపల్లి రాచకొండ కమిషనరేట్ కార్యాలయ స్థలంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ మహేందర్​రెడ్డి, సీపీ మహేశ్​ భగవత్​లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరితహారంతో రాష్ట్రమంతటా పచ్చదనం పెరిగిందని మహమూద్‌ అలీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలన్నారు.

'హరితహారంలో పోలీస్​ శాఖ భాగం కావడం సంతోషం'

author img

By

Published : Jul 29, 2021, 5:29 PM IST

రాచకొండ పోలీస్​ కమిషనరేట్ కార్యాలయం కోసం భూములు ఇచ్చిన వారికి హెచ్ఎండీఏలో వెయ్యి గజాల స్థలాన్ని త్వరలోనే అందజేస్తామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. హరిత హారంలో భాగంగా మేడిపల్లి రాచకొండ కమిషనరేట్ కార్యాలయ స్థలంలో.. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా హరితహారంతో రాష్ట్రమంతటా పచ్చదనం పెరిగిందని మహమూద్‌ అలీ పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలతో పోలీసులు ప్రజలకు మరింతగా దగ్గరయ్యారని అన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్​ను ఇలాగే కొనసాగించాలని సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో పోలీసులు భాగం కావడం సంతోషకరం. మేడికొండ రాచకొండ కమిషనరేట్​ పరిధిలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందుకు డీజీపీ మహేందర్​రెడ్డి, సీపీ మహేశ్​ భగవత్​లకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి.-మహమూద్​ అలీ, హోం మంత్రి

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ ప్రకృతి ఒడిలో ఉందన్నారు. ఈ సందర్భంగా దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు.

దిగ్విజయంగా కొనసాగుతున్న హరితహారంలో పోలీసుశాఖ భాగం కావడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ బాధ్యతగా తయారు చేయడమే సోషల్‌ పోలీసింగ్‌ లక్ష్యమని తెలిపారు. హరితహారం కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు.

ప్రకృతిని కాపాడటంలో, ప్రకృతి సంపదను అభివృద్ధి చేయడంలో పోలీస్​ శాఖ ఎప్పుడూ ముందుంటుంది. ఈరోజు కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. హరితహారం కార్యక్రమం కూడా అందులో భాగమే. మనం చేసే పనిలో సాధారణ ప్రజలనూ భాగస్వామ్యం చేయగలిగితే శాంతి భద్రతలను కాపాడటం చాలా తేలిక. -మహేందర్​రెడ్డి, డీజీపీ

మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో లక్షకు పైగా మొక్కలు నాటడమే తమ లక్ష్యమని కమిషనర్ మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని వివరించారు.

'హరితహారంలో పోలీస్​ శాఖ భాగం కావడం సంతోషం'

ఇదీ చూడండి: నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.