ETV Bharat / state

'నిమ్స్​కు వచ్చేవారు పేదవారు​ .. వారికి ప్రేమను, మమకారాన్ని పంచండి' - Harish Rao in Nims Hospital

Newly Appointed Assistant Professors at NIMS: నిమ్స్ ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం, విశ్వసనీయత ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. నిమ్స్​లో వైద్యం కోసం వచ్చిన వారిలో ఎక్కువ శాతం పేదలు ఉచితంగా చికిత్స పొందేవారే ఉంటారని ఆయన గుర్తుచేశారు. నిమ్స్​లో నూతనంగా నియామకమైన అసిస్టెంట్​ ప్రొఫెసర్స్​కు ఆయన నియామక పత్రాలు అందజేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 28, 2023, 4:28 PM IST

Newly Appointed Assistant Professors at NIMS: హైదరాబాద్​లోని నిమ్స్​ ఆసుపత్రిలో నూతనంగా నియామితులైన 26 మంది అసిస్టెంట్​ ప్రొఫెసర్​లకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో ఎక్కువశాతం పేదలు, ఉచితంగా చికిత్స పొందేవారే ఉంటారని గుర్తుచేశారు. వారికి ఓపికతో చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

తొలిసారి నిమ్స్ ఆసుపత్రిలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన తెలిపారు. బాగా పనిచేసే వైద్యులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహాకాలు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యులు వ్యక్తిగత లాభాలు చూసుకోకుండా ప్రభుత్వం కోసం, పేద ప్రజల కోసం పనిచేయాలని హితావుపలికారు. అందరూ కలిసి పనిచేస్తే అద్బుతమైన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. నిమ్స్​లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయని వాటిని కూడా భర్తీ చేయాలని నిమ్స్​ అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించే విధంగా చూడాలని ఆరోగ్య శ్రీ సీఈఓ సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఎల్​ఓసీలు కూడా ఎక్కువగా నిమ్స్​ ఆసుపత్రికే ఇస్తున్నామని తెలిపారు. 3 వేల 630 పడకల ఆసుపత్రిగా నిమ్స్​ రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కొత్తగా నియామితలైన అసిస్టెంట్​ ప్రొఫెసర్​లకు మంత్రి శుభకాంక్షలు తెలిపారు.

అంతకు ముందు ఎర్రమంజిల్​లో నిమ్స్ మాత శిశు నిమ్స్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం.సి.హెచ్ ఆసుపత్రికి మంత్రి భూమి పూజ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.ఎం.సి.హెచ్.ల మీద రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. గాంధీలో, అల్వాల్​లో , నిమ్స్​లో మొత్తం 600 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

"అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయండి. నిమ్స్ ఆసుపత్రికి వచ్చే వారు పేదవారు. పేద రోగులకు ప్రేమను, మమకారాన్ని పంచండి. బాగా పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు పెంచుతాం. నిమ్స్‌పై ప్రజలకు అధిక విశ్వాసం ఉంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించాలి. ఎల్‌వోసీ కూడా నిమ్స్‌కే ఎక్కువగా ఇస్తున్నాం. నిమ్స్‌లో పనిచేయడం కొంత కష్టంగా ఉంటుంది. నిమ్స్‌లో విశ్వాసం, విశ్వసనీయతతో పనిచేయాలి. 3,630 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటుంది. బాగా పనిచేసేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలి".- హరీశ్​రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

'మాతా, శిశు మరణాల తగ్గింపులో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది'

'కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కేటీఆర్‌ ఎలా చెప్పారు..?'

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.