ETV Bharat / state

ప్రతిపక్షాల ఎత్తులను హరీశ్​ రావు చిత్తు చేయగలడా..? - etv bharat

దుబ్బాక గడ్డ మీద సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ స్థానం నిలబెట్టుకోవాలని తెరాస.. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని సంకేతాలు ఇవ్వాలన్న పట్టుదలతో కాంగ్రెస్, భాజపా ఉన్నాయి. దుబ్బాక గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న ట్రబుల్ షూటర్ హరీశ్ రావు.. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేందుకు.. ప్రచారంలో తమ లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకునేందుకు వినూత్నమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు.

harish rao plan for dubbaka by election in siddipeta district
ప్రతిపక్షాల ఎత్తులను హరీశ్​ రావును చిత్తు చేయగలడా..?
author img

By

Published : Oct 24, 2020, 1:47 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ప్రధానపార్టీలకు కీలకంగా మారింది. ఎవరికి వారు విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగారు. కాంగ్రెస్, భాజపా తమ రాష్ట్ర నాయకులందరినీ దుబ్బాకలో దింపాయి. భారీ మోజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న హరీశ్ రావు.. వ్యక్తిగతంగా ప్రత్యేక నిఘా బృందాన్ని రంగంలోకి దింపారు. తన ముఖ్య అనుచరుడికి ప్రత్యేక నిఘా బాధ్యతలు అప్పగించారు. అతని ఆధ్వర్యంలో 30 మంది యువకులు రంగంలోకి దిగారు.

గ్రామాల వారీగా నివేదిక

ప్రతి రోజు ఒక్కో మండలానికి బృందంలోని ఆరుగురు సభ్యులు వెళ్తారు. ఆ మండల పరిధిలోని గ్రామాల్లో సాధారణ ప్రజల్లా పర్యటించి.. గ్రామంలో తమ పార్టీ పరిస్థితి.. నాయకుల మధ్య సమన్వయం, ఎవరికి గ్రామంలో పట్టు ఉంది.. ప్రచారంలో లోపాలు.. సవరించుకోవాల్సిన అంశాలు వంటి సమాచారం సేకరిస్తున్నారు. ప్రతిపక్షాల బలాలు, బలహీనతలు గుర్తిస్తున్నారు. ఇతర పార్టీ నాయకుల కదలికలు.. వారి నుంచి తమ పార్టీ కార్యకర్తలకు వచ్చే ప్రలోభాలపైనా నిఘా పెడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆ వివరాలను గ్రామాల వారీగా నివేదిక రూపొందించి హరీశ్ రావుకు అందిస్తున్నారు.

ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి

పనిలో పనిగా.. బుజ్జగించాల్సిన.. మందలించాల్సిన వారి పేర్లు.. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి వంటి వివరాలు కూడా ఇస్తున్నారు. ఈ ప్రత్యేక నిఘా బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీశ్ రావు ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తనదైన శైలిలో లోపాలను సరిదిద్దుతున్నారు. ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొంది.. తటస్థంగా ఉన్న వారి వివరాలు కూడా ఈ బృందం సేకరిస్తోంది. మొత్తానికి భారీ అధిక్యం సాధించడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా హరీశ్ రావు టాస్క్ ఫోర్స్​ను రంగంలోకి దించారు.

ఇదీ చదవండి : విపత్తుల కల్లోలం.. పర్యావరణ పరిరక్షణ అత్యావశ్యకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.