ETV Bharat / state

Harish Rao Inaugurates Arete Hospital : 'అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా తెలంగాణ మారనుంది' - హరీశ్‌రావు ఇన్‌ అరీట్ ఆస్పత్రి

Harish Rao Inaugurates Arete Hospital : రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఆస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల వైద్య సదుపాయాలు లభిస్తున్నాయని తెలిపారు.

Arete Hospital in Hyderabad
Harish Rao Inaugurates Arete Hospital
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 7:53 PM IST

Harish Rao Inaugurates Arete Hospital in Hyderabad : తెలంగాణ అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా మారుతుందని.. దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటి పార్కు సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అరీట్ హస్పిటల్‌(Arete Hospital)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ 250 పడకల సదుపాయాలతో అత్యాధునిక అంతర్జాతీయ వైద్యం, న్యూరోసైన్సెస్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, రెనల్ సైన్సెస్, ప్రివెంటివ్ హెల్త్, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోసైన్సెస్, పల్మోనాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు.

Harish Rao on Hyderabad Medical Development : రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయన్నారు. వైద్య సేవలు పొందేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మెడికల్‌ టూరిజం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

Harish Rao Inaugurates Robotic Surgery Equipments : 'క్యాన్సర్‌కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి'

Hyderabad Become a Global Medical Hub : వైద్య నిపుణులు, అన్నిరకాల సిబ్బంది, సౌకర్యాలు ఉండడం వల్ల హైదరాబాద్‌ మెడికల్ హబ్‌గా పెరిగేందుకు ఒక కారణమని అన్నారు. హైదరాబాద్‌లో వైద్యరంగమే కాకుండా ప్రతి రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ప్రజలకు ఆర్థిక భారం కాకుండా తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని అరిట్‌ ఆస్పత్రి యాజమాన్యానికి సలహా ఇచ్చారు. . ఆసుపత్రి సేవలను పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి.. మెరుగైన సేవలను అందించటమే లక్ష్యంగా అరీట్ హాస్పిటల్స్‌ని నిర్మించామని హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి తెలిపారు.

"హైదరాబాద్‌లో మరొక అంతర్జాతీయ స్థాయిలో అరీట్‌ ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఫార్మా హబ్‌, ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ త్వరలోనే మెడికల్‌ గ్లోబల్‌ హబ్‌గా మారనుంది. పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, వివధ దేశాల నుంచి హైదరాబాద్‌కి వైద్య సేవల కోసం వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్‌ ఆస్పత్రుల మాదిరిగా తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్‌కి వివిధ ప్రదేశాల నుంచి వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. మెడికల్‌ టూరిజం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతోంది. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ డబ్బులతో.. మంచి వైద్యం అందించాలి."- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

Arete Hospital హైదరాబాద్‌లో అరిట్ ఆస్పత్రి ప్రారంభించిన హరీశ్‌రావు

Harish Rao on Hyderabad Development : 'హైదరాబాద్‌ అభివృద్ధి 'రజినీ'కి అర్థమైంది.. ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ గజినీలకు అర్థమైతలేదు'

Harishrao Distributes Gruhalakshmi Documents : తిట్ల ప్రభుత్వం కావాలా?.. కిట్ల ప్రభుత్వం కావాలా?

Harish Rao Inaugurates Ayush Centre at Nims : 'సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే 9 మెడికల్​ కళాశాలలు ప్రారంభిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.