ETV Bharat / state

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది' - Harish Rao Twitter X Latest News

Harish Rao Counter to Congress Guarantees : తుక్కుగూడ సభలో హస్తం పార్టీ ఆరు గ్యారెంటీ హమీలను ప్రకటించింది. దీనిపై ట్విటర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఎలాగో గెలవమని అర్థమైపోయి.. బూటకపు హామీలు ఇచ్చారని హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao latest news
Harish Rao criticizes Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 11:01 AM IST

Harish Rao Counter to Congress Guarantees in Telangana : తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే.. అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ హమీలను సోనియా గాంధీ ఈ వేదికగా ప్రకటించారు. హస్తం పార్టీ ప్రకటించిన హామీలపై.. మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ అలవికాని హామీలు, అబద్ధపు ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు, ఆత్మవంచన, పరనిందలతో సాగిందని ఆయన ఆరోపించారు.

Harish Rao on Congress Six Guarantees : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి గ్యారంటీల పేరిట కాపీ కొట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదనుకునే.. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్న చందంగా బూటకపు హామీలు ఇచ్చారని ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అవగాహన లేకుండా మాట్లాడారని వివరించారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని చెప్పారు. 2014లో కాంగ్రెస్‌ బూటకపు హామీలు ఇస్తే దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని హరీశ్‌రావు గుర్తు చేశారు.

  • అల‌వికాని హామీలు, అబ‌ద్ధాల ఆరోప‌ణ‌లు, చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌లు.. కాంగ్రెస్ స‌భ సాంతం ఆత్మ‌వంచ‌న‌, ప‌ర‌నింద‌గా సాగింది.

    • కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అస‌లు కాంగ్రెస్ కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదు.

    • గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది కాంగ్రెస్‌ పార్టీ…

    — Harish Rao Thanneeru (@BRSHarish) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. కాంగ్రెస్‌, బీజేపీ కావాలా?'

Harish Rao Fires On Congress : కర్ణాటకలో ఇలాగే అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగమాగం అవుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మీది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన గ్యారెంటీలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేం విపక్షాలకే మద్దతిచ్చామని హరీశ్‌రావు గుర్తు చేశారు.

Telangana Congress Six Guarantees : జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. మీరు జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉందా.. లేదా..? అని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీయే హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా తమ నేతలను వేధిస్తున్నాయని హరీశ్‌రావు విమర్శించారు.

కానీ కాంగ్రెస్‌కు సంబంధించిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald case)ఎందుకు అటకెక్కిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాబర్ట్‌వాద్రా కంపెనీల అక్రమాలపై బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని? అని అన్నారు తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్‌ నేతపైనా ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు..? అని పేర్కొన్నారు. బీజేపీ, హస్తం పార్టీ మిలాఖాత్‌ కావడం ప్రపంచానికి తెలిసిన విషయమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.

అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుందని హరీశ్‌రావు విమర్శించారు. మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేల సంఖ్యలో ఉన్నాయని ఆరోపించారు. స్కామ్‌ల సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌ అని హరీశ్‌రావు విమర్శించారు. మీది కాంగ్రెస్‌ కాదని.. స్కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఏ కోణంలో చూసినా హస్తం పార్టీలో కుంభకోణమే కనిపిస్తుంది అని హరీశ్‌రావు ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.

Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో.. హైదరాబాద్​​ హెల్త్ ​హబ్​గా మారింది'

Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.