ETV Bharat / state

కరోనా సాయం పెంచాలి.. కేంద్ర మంత్రిని కోరిన హరీశ్‌రావు..

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రగతి భవన్‌ నుంచి సమావేశానికి హాజరయ్యారు.

Harish Rao asked the Union Minister to increase corona aid
కరోనా సాయం పెంచాలి.. కేంద్ర మంత్రిని కోరిన హరీశ్‌రావు..
author img

By

Published : May 13, 2021, 7:04 AM IST

చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కరోనా రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుండటంతో పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని, ఇది రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని కరోనా చికిత్సకు ఉపయోగించే పరికరాలు, మందులు, ఆక్సిజన్‌ కోటా పెంచాలన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు తెలంగాణ తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రగతి భవన్‌ నుంచి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి, సాంకేతిక సలహాదారు గంగాధర్‌ తదితరులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘‘మెడికల్‌ హబ్‌గా మారిన హైదరాబాద్‌కు చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారనే అంచనా లేకపోవడం, ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతుండటం రాష్ట్రంలో మందులు, పడకల కొరతకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులు, రాష్ట్రంలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసులు, భర్తీ అవుతున్న పడకల ఆధారంగా కేటాయింపులు పెంచాలి.

మౌలిక వసతులను గణనీయంగా పెంచాం

కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను గణనీయంగా పెంచింది. పడకల సంఖ్యను 18,232 నుంచి 53,775కు, 9,213గా ఉన్న ఆక్సిజన్‌ పడకలను 20,738కి, ఐసీయూ పడకలను 3,264 నుంచి 11274కు పెంచాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటింటికీ తిరిగి జ్వర బాధితులను గుర్తించేలా 27,039 వైద్య బృందాలను నియమించాం. ఈ కార్యక్రమం ద్వారా కరోనా బాధితులను ముందుగానే గుర్తించి మందులు ఇస్తూ వ్యాధి వ్యాప్తి కాకుండా ఆపగలుగుతున్నాం. ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఉచితంగా కరోనా కిట్లు అందజేస్తున్నాం. ఇప్పటివరకూ 60 లక్షల ఇళ్లలో జ్వర సర్వే పూర్తయింది.
1.29 కోట్ల టీకా డోసులు..రెండు వేల వెంటిలేటర్లు పంపండి

హైదరాబాద్‌కు పోటెత్తుతున్న రోగులను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్‌ కోటాను 450 మెట్రిక్‌ టన్నుల నుంచి 600 మెట్రిక్‌ టన్నులకు పెంచాలి. ఒడిశా వంటి సుదూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి ట్యాంకర్లు పంపాలి. ప్రాణాధార మందులైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రోజూ 20 వేలు సరఫరా చేయాలి. టొసిలిజుమాబ్‌ కోటాను 810 నుంచి 1500లకు పెంచాలి. రెండు లక్షల కరోనా పరీక్షల కిట్లను వెంటనే సరఫరా చేయాలి’’ అని హరీశ్‌రావు కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రానికి 1.29 కోట్ల టీకా డోసుల అవసరం ఉందని, ఈ నెలాఖరు నాటికి కనీసం 10 లక్షల కొవిషీల్డ్‌, 3 లక్షల కొవాగ్జిన్‌ డోసులు సరఫరా చేయాలని విన్నవించారు. వీటితోపాటు రెండు వేల వెంటిలేటర్లు పంపాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణకు అవసరమైన మేరకు ఆక్సిజన్‌తోపాటు ఇతర మందులు, వైద్య సామగ్రిని పంపుతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందంటూ సంతృప్తి వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.