ఉద్యమాల పునాదుల పైనే రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించుకోవాలని ఆచార్య హర గోపాల్ సూచించారు. వరవరరావు అరెస్టుకు నిరసనగా... నాంపల్లిలోని తెలంగాణ ఎన్జీవో భవన్లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తలపెట్టిన సభను అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బందాలే కొనసాగుతున్నాయని... పాలకులు మాత్రమే మారారన్నారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే... ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈసీ విశ్వసనీయతపై అనుమానాలున్నాయి: సురవరం