ETV Bharat / state

ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు! - friend

నిక్కర్ వేసుకునే వయస్సు నుంచి జీన్స్ వేసే వరకూ...చాక్లెట్​ను సగం సగం పంచుకునే చిన్నతనం నుంచి..బిర్యానీ తినే వరకూ...సైకిల్​ ప్రయాణం నుంచి బైక్​పై..తిరిగే వరకూ...కాలేజీ​లో చిలిపి చేష్టల నుంచి జీవితంలో స్థిరపడే వరకూ ఇలా ప్రతి చోట ఆనందాన్ని, బాధను పంచుకునేది స్నేహితుడు. అలాంటి మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు!
author img

By

Published : Aug 4, 2019, 9:03 AM IST

నీతో రక్తం సంబంధం లేదు..బంధువు కాదు. ఇంట్లో వ్యక్తి కాదు...అవసరం వస్తే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. ఏంటో చెప్పు నేనున్నానంటూ భుజంపై చేయి వేస్తాడు. ఎక్కడో పుడతాడు..ఎక్కడో పెరుగుతాడు. అసలు సంబంధమే లేని వ్యక్తి..అయినా జీవితంలో ప్రతి చోట నీతోనే ఉంటాడు. వాడే ఫ్రెండ్.

స్నేహం...ఎక్కడ మెుదలవుతుందో తెలియదు. ఎందుకూ అనే ప్రశ్నే రాదు. కష్టమొస్తే..కన్నీరు తుడుస్తాడు. సంతోషమొస్తే పంచుకుంటాడు. అమ్మ, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు..ఇలా అన్ని బంధాలను దేవుడే ఇచ్చినా..స్నేహితుడిని మాత్రం నువ్వే ఎంచుకోమని పంపిస్తాడు. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే...నీ స్నేహితులెవరో చెప్పు..నువ్వేంటో చెప్తా..అనే ఓ మహానుభావుడి మాటలు చాలు..జీవితంలో స్నేహం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!

కష్టాల్లో ఏకాకిలా ఉన్నప్పుడు...అమ్మలా...ఓదార్చేవాడు!
నీకు కన్నీళ్లు వస్తే...నీ కంటే ఎక్కువగా బాధపడేవాడు!
నీ కంటి నుంచి జారిన కన్నీటిని...గుండెల్లో దాచుకుని ఓదార్పునిచ్చేవాడు!
నీ ఆనందాన్ని...తన సంతోషంగా భావించేవాడు!
శిలలా ఉన్న నిన్ను....శిల్పంగా చెక్కేవాడు!
నీ విజయాన్ని...జయంగా చెప్పుకునేవాడు!
జీవితపు ప్రతిమలుపులోనూ...దారి చూపేవాడు!
అందమైన జ్ఞాపకంగా...మిగిలిపోయేవాడు! స్నేహితుడు!

ఇవీ చూడండి:స్నేహం... అక్షరాలకందని అనుభూతుల జీవన ప్రయాణం...

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.