చేనేత రంగం రోజురోజుకూ ఆటుపోట్లు ఎదుర్కొంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. చేనేత స్థానంలో పవర్ లూమ్స్ రావడం వల్ల మగ్గాలు నేసుకుంటూ బతికే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చేనేత కార్మికులు దినదినగండంగా తమ బతుకులు వెళ్లదీస్తున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. వారికి ఉచిత రేషన్‌తోపాటు నెలకు రూ.7,500 అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'