హైదరాబాద్ మలక్‌పేటలో దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ఆరోపిస్తూ ఆ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు వికలాంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కమిషనర్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు.
2017 నుంచి ఇప్పటి వరకు ఒక్క దివ్యాంగునికి రుణాలు మంజూరు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం