కరోనా వ్యాపిస్తున్న వేళ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత గుర్తు చేస్తూ ప్రగతి భవన్లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రగతి భవన్‌లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు. మంత్రులు, సీనియర్ అధికారులు చేతులు కడుక్కుని, శానిటైజర్‌తో శుభ్ర పరుచుకుని లోపలికి రావాలని నిబంధన పెట్టారు.
నేటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము