ETV Bharat / state

'శ్రీనివాస్​రెడ్డి లాంటి వాళ్లకు ఉరిశిక్ష పడాలి'

రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు చేస్తూ... వారి పసి జీవితాలను చిదిమేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఇటీవల బొల్లారం తుర్కపల్లిలో ఆరు సంవత్సరాల చిన్నారి ప్రవళిక, బొమ్మలరామరం హాజీపూర్ గ్రామంలో మూడు హత్యల ఘటనలో బాధిత కుటుంబ సభ్యులతో పలు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్​లో సమావేశం నిర్వహించారు.

author img

By

Published : May 2, 2019, 7:49 PM IST

'శ్రీనివాస్​రెడ్డి లాంటి వాళ్లకు ఉరిశిక్ష పడాలి'

బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. సమాజంలో చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలని లీగల్​ సర్వీసెస్​ అథారిటీ తెలంగాణ ప్రతినిధి, న్యాయవాది జోయమహావీన్ కోరారు.

తుర్కపల్లికు చెందిన ఎల్​కేజీ చదువుతున్న ఆరేళ్ళ చిన్నారి ప్రవళికను మార్చ్ 21 హొలీ పండుగ రోజు బీహార్​కు చెందిన యువకుడు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చారని వారు ఆవేదన చెందారు. అదే విధంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రావణి, మనీషా, కల్పనలను హత్యలు చేసిన శ్రీనివాస్​రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి మూడు నెలలులోగా నిందితులకు ఉరి శిక్ష పడేలా చూడాలని న్యాయవాది జోయమహావీన్ కోరారు. బాధిత కుటుంబ సభ్యులకు నిర్భయ ఫండ్ వచ్చేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.