ETV Bharat / state

ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాల గడువు పొడిగింపు - హైదరాబాద్​ తాజా వార్తలు

2021-22 విద్యా సంవత్సరం సంబంధించి ప్రతిభ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును పొడించారు. జనవరి 10 వరకు గడువు పొడిగిస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ప్రకటన విడుదల చేసింది.

gururkula admissions extended to january 10
ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాల గడువు పొడిగింపు
author img

By

Published : Dec 31, 2020, 10:21 PM IST

ప్రతిభ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును జనవరి 10 వరకు పొడిగించారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని 33 ప్రతిభ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సీఓఈ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. పూర్తి వివరాల కోసం http://tswreis.in వెబ్​సైట్ లేదా 1800 4254 5678 టోల్ ఫ్రీ నంబరు ద్వారా సంప్రదించాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.

ఇదీ చదవండి: చెరువు మట్టి కింద కూరుకుపోయిన చిన్నారులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.