లాక్ డౌన్ అనంతరం తొలిసారి గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రవేశ పరీక్షలను అధికారులు అన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్లోని మహేంద్రహిల్స్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగకల్యాణి తెలిపారు.
మహేంద్రహిల్స్ గురుకుల పాఠశాలకు 411 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆమె తెలిపారు. చిన్నారులకు, వేచి ఉండే తల్లిదండ్రులకు మంచినీటి సదుపాయం కల్పించామని అన్నారు. పరీక్ష ప్రారంభానికి చివరి నిమిషంలో వచ్చిన ఇద్దరు చిన్నారులను ఉన్నతాధికారుల సూచన మేరకు పరీక్ష రాయడానికి అనుమతించామని ఆమె తెలిపారు.