ETV Bharat / state

కల్వకుంట్ల కవిత కృషితో స్వస్థలాలకు వలస కూలీలు - corona effect

గల్ఫ్​ దేశాల నుంచి రెండు వారాల క్రితం విజయవాడకు చేరుకున్న తెలంగాణవాసులు స్వస్థలాలకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లకు చెందిన వలస కూలీలు ఇళ్లకు చేరుకున్నారు. తమకు ఇళ్లకు చేర్చేందుకు కృషి చేసిన కవితకు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

gulf migrants reached their homes in kavitha arranged special bus

author img

By

Published : Jun 28, 2020, 10:30 PM IST

గల్ఫ్​ దేశాల నుంచి వచ్చి విజయవాడలో చిక్కుకుపోయిన తెలంగాణవాసులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో స్వస్థలాలకు చేరుకున్నారు. రెండు వారాల క్రితం నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లకు చెందిన 32 మంది వలస కూలీలు బెహ్రయిన్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అక్కడ క్వారంటైన్ ముగిసినా... ప్రయాణ ఏర్పాట్లు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని కొందరు కవిత దృష్టికి తీసుకెళ్లారు.

కవిత విజయవాడ నుంచి బస్సును ఏర్పాటు చేశారు. బస్సులో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. మాజీ ఎంపీ కవిత బస్సును ఏర్పాటు చేయటం వల్లే తాము స్వస్థలాలకు చేరుకోగలిగామని వలస కూలీలు తెలిపారు. కవితకు తెరాస జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షడు దావ సురేశ్​, నాయకులు బోగ ప్రవీణ్, జాగృతి నాయకులు రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'ప్రియుడితో కలిసి అమ్మే నాన్నను చంపేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.