ETV Bharat / state

gulab cyclone effect: శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాన్ బీభత్సం

గులాబ్ తుపాన్ ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళి, వంశధారకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు, రహదారులకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

gulab cyclone effect
gulab cyclone effect
author img

By

Published : Sep 27, 2021, 7:21 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • తుపాన్ ప్రభావంతో గడిచిన 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు మూడొందల వరకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో కాలనీలు నీటమునిగాయి. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, పలు వాణిజ్య పంటలు నేలమట్టమయ్యాయి. లావేరు మండలంలో గడ్డ వాగులు ఎక్కడికక్కడ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
  • ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి ప్రాంతాల్లో తుపాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బూర్జ మండలంలోని లక్కుపురం వీధులనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. అల్లెన పరిధిలో కిలంతర వద్ద రహదారికి అడ్డంగా కూలిన చెట్లు కూలాయి. కొండల నుంచి వర్షపు నీరు ఓనిగెడ్డ నుంచి పెద్దచెరువు, కొత్తచెరువు, జగ్గునాయుడు చెరువులకు చేరి.. లక్కుపురం నుంచి నాగావళి నదిలో ప్రవహిస్తోంది. లక్కుపురం గ్రామం ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
  • వరద నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళి, వంశధారకు వరద నీరు వచ్చి చేరుతోంది. అధిక నీటి మట్టం కారణంగా హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి నీటి విడుదల చేశారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మడ్డువలస ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. ఈ నీటిని నాగావళిలోకి వదులుతున్నారు.
  • జిల్లాలో వర్షానికి పలుచోట్ల కొబ్బరిచెట్లు నెలకొరిగాయి. 4 మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
  • జి.సిగడం మండలం గడ్డకంచరంలో వర్షం కారణంగా పాఠశాల ప్రహరీ కూలింది. ఈ ఘటనలో 7 ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి.
  • మందస మండలంలో కొబ్బరిచెట్టు పడి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.
  • చీడివలస పంచాయతీ గంగంపేటలో విద్యుత్తు స్తంభం కూలడంతో అధికారులు మరమ్మతు చేపడుతున్నారు. ఆమదాలవలస మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోద్దలపెట గ్రామానికి వెళ్లే రహదారిలో భారీ వృక్షం నేలకొరిగింది.
  • ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం గెడ్డకంచారంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో 7 ద్విచక్ర వాహనాలు, 10 సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. ఇటీవలే నాడు నేడు పనుల్లో సుమారు రూ.3. లక్షలు పెట్టి ఈ ప్రహరీ నిర్మించారు. పనుల్లో నాణ్యత లోపంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రహరీ నిర్మించినప్పుడు నిబంధనలు పాటించకపోవడంతో కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రాణనష్టం తప్పిందని అన్నారు. పునాది ఇవ్వకుండా ఇటుకతో కట్టేసి రంగులేసేసారు అని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: Gulab Cyclone Effect on Telangana: రాష్ట్రంలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.