ETV Bharat / state

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు నిబంధనలు ఇవే... - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుపై ఎస్‌ఈసీ నిబంధనలు విడుదల చేసింది. నవంబర్1 తర్వాత కరోనా పాజిటివ్​ వచ్చిన వారికి బ్యాలెట్‌ కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్​లు ఆర్వోకు, ఆన్ లైన్​లోఎన్నికల సంఘం వెబ్ సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ghmc
ghmc
author img

By

Published : Nov 19, 2020, 6:55 PM IST

కరోనా నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసేందుకు రాష్ట్ర ఎన్నిలక సంఘం నిబంధనలు విడుదల చేసింది. నవంబర్ 1 తరువాత నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సైనిక సంస్థల్లో పని చేసేవారు, వారి సతీమణులు, జైళ్లలో ఉన్న ఖైదీలకు పోస్టల్ బ్యాలెట్​కు అవకాశం కల్పించారు. ఎన్నికల విధుల్లోని సిబ్బంది, వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్​కు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్​లు ఆర్వోకు, ఆన్ లైన్​లోఎన్నికల సంఘం వెబ్ సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తుతో పాటు గుర్తింపు కార్డు నకలు, ఫొటో, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని పేర్కొన్నారు. నవంబర్ 1 తర్వాత ఎవరైన కరోనా బారీన పడితే పాజిటివ్​ రిపోర్ట్​తో పాటు ఆధార్, ఫొటో జతచేసి సమర్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఆమోదం పొందిన వారు... పోలింగ్ కేంద్రానికి అనుమతి లేదని.. ఎన్నికలకు 7 రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్​కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

ఇదీ చదవండి : పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.