కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఎస్టీ పరిహారంలో ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ.352 కోట్లు అందాయి. జీఎస్టీ వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు చట్టప్రకారం కేంద్రం పరిహారం ఇస్తుంది.
తెలంగాణ రాబడులు బాగానే ఉన్నందున జీఎస్టీ అమల్లోకి వచ్చిన కొత్తలో మాత్రమే రాష్ట్రానికి పరిహారం వచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రం మళ్లీ జీఎస్టీ పరిహారం పొందింది.
ఇప్పటి వరకు పరిహారం కింద తెలంగాణ రూ.1900 కోట్లు వచ్చాయి. తాజాగా మరో రూ.352 కోట్లు రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
- ఇదీ చూడండి: భారీగా పడిపోయిన వాహనాల అమ్మకాలు