ETV Bharat / state

Group-1 Notification: వచ్చేసింది గ్రూప్​-1.. ఇంత భారీసంఖ్యలో భర్తీ ఇదే ప్రథమం.. - Tspsc News

Group
Group
author img

By

Published : Apr 26, 2022, 7:56 PM IST

Updated : Apr 27, 2022, 5:39 AM IST

19:49 April 26

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్

Group-1 Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా, ఇంత భారీసంఖ్యలో గ్రూపు-1 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మే నెల రెండో తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్షలతోనే ఎంపిక చేయనున్నారు. వీటిని ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వేగవంతంగా పోస్టుల భర్తీ, పారదర్శకత కోసం ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష జులై లేదా ఆగస్టులో... మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ లేదా డిసెంబర్‌ నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షల విధానం, సిలబస్‌ తదితర సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను అభ్యర్థులు చూడవచ్చు.

ఇవీ ముఖ్యాంశాలు

  • ప్రాథమిక (ప్రిలిమ్స్‌) పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌) ఓఎంఆర్‌ విధానంలో, ప్రధాన (మెయిన్స్‌) పరీక్ష సంప్రదాయ (కన్వెన్షనల్‌) పద్ధతిలో జరగనున్నాయి. తొలిసారిగా ఉర్దూభాషలోనూ ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు.
  • ప్రిలిమ్స్‌ క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ప్రతి బహుళజోన్‌లో ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులను 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. దీనికి కుల రిజర్వేషన్‌, లింగం, ఈడబ్ల్యూఎస్‌, క్రీడలు, దివ్యాంగ కోటాలను పరిగణనలోకి తీసుకుంటారు.
  • కొత్త జోనల్‌ విధానాల మేరకు అభ్యర్థులు విధిగా టీఎస్‌పీఎస్‌సీ ఓటీఆర్‌లో నమోదు చేసుకోవాలి.
  • ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల తేదీ నాటికి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి.
  • తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌, క్రీడా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
  • ప్రధాన పరీక్షకు ముద్రిత ప్రశ్నపత్రానికి బదులు ఎలక్ట్రానిక్‌ ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. కంప్యూటర్‌ తెరపై కనిపించే ఈ-ప్రశ్నపత్రం చూసి, మాన్యువల్‌ (తెల్లకాగితాలపై) విధానంలోపరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా డిజిటల్‌ మదింపు (ఎవాల్యుయేషన్‌) విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు.
  • గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు-1 జాబితాలో ఆరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. తాజా జాబితాలో వాటికి బదులు పురపాలక గ్రేడ్‌ -2 కమిషనర్‌ పోస్టుల సంఖ్యను మరో ఆరు పెంచారు.
  • ఆన్‌లైన్‌లో సమర్పించే దరఖాస్తులకు మే 31వ తేదీ రాత్రి 11.59 వరకు రుసుము చెల్లించవచ్చు.
  • ప్రిలిమ్స్‌ నాటికి ప్రభుత్వ శాఖల నుంచి అదనంగా ఖాళీలు వస్తే వాటిని కూడా జాబితాకు కలుపుతారు.
  • డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతీ కొలత 86.3 సెం.మీ. ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు కలిగి ఉండాలి. హైదరాబాద్‌ సరోజినిదేవి, ఉస్మానియా కంటి ఆసుపత్రుల్లోని ఆఫ్తాల్మిక్‌ సర్జన్‌ ద్వారా దృష్టి పరీక్షల ధ్రువీకరణపత్రం ఉండాలి.
  • వయోపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
  • మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలుంటాయి. మెయిన్స్‌ పరీక్షలు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ( హెచ్‌ఎండీఏ) పరిధిలో నిర్వహిస్తారు.

విద్యార్హతలివే..

  • డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్‌, సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏవో, ఎంపీడీవో పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి.
  • ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్‌/ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా అందుకు సమానమైన డిగ్రీ పొంది ఉండాలి. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవ (సోషల్‌ వర్క్‌)లో పీజీ పట్టా కలిగిన వారికి ప్రాధాన్యమిస్తారు.
  • సాంఘిక సంక్షేమ ఏడీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు.
  • సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్‌/ఎకనామిక్స్‌/ గణితశాస్త్రం డిగ్రీల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రూప్‌ 1 పోస్టులకు సంబంధించి వయోపరిమితి, పే స్కేలు వివరాలు

..
..
..

ఇవీ చదవండి :

Last Updated : Apr 27, 2022, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.