నెదర్లాండ్‌లో వేరుశనగ దిగుమతిదారుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో నెదర్లాండ్స్ వేరుశనగ పరిశ్రమ దిగుమతిదారుల తరఫున నెక్స్ ప్యాక్, అమెరికాలో వేరుశనగపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు విలియం ఈపెరల్, చెరిల్ ఈ హ్యారిసన్ పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్న వేరుశనగను రైతులకు లాభం కలిగేలా దళారుల ద్వారా కాకుండా నేరుగా యూరప్‌కు ఎగుమతి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉత్పత్తి, ప్యాకింగ్, ఎగుమతుల్లో సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం