సేవాధాన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్లోని పలువురు అర్చకులకు బియ్యం సహా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సుమారు 150 మందికి నగదును సైతం అందించామని సంస్థ ప్రతినిధి స్రవంతి తెలిపారు. ఆస్ట్రేలియాలోని కొందరు దాతలు ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆమె వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని సేవాధాన్ ప్రతినిధి స్రవంతి స్పష్టం చేశారు. పేదలకు సాయం అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు.
పేద అర్చకులకు బియ్యం సహా సరుకుల పంపిణీ - నిత్యావసర సరుకులు
సేవాధాన్ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవకు ముందుకు వచ్చింది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పురోహితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సేవధాన్ తెలిపింది. ఈ క్రమంలో పేద బ్రాహ్మణులకు కిరాణా సామగ్రి పంపిణీ చేశామని సంస్థ వెల్లడించింది.