శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం క్లీన్ ఇండియా- గ్రీన్ ఇండియా పేరుతో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ హరికృష్ణ అన్నారు. తన వంతు బాధ్యతగా మొక్కలు నాటిన ఆయన.. పాఠశాల సిబ్బంది, టీచర్లు, విద్యార్థులకు ఛాలెంజ్ విసిరారు.
ప్రతి విద్యార్థి మొక్కలు నాటడమే... తమ టీచర్లకు సెప్టెంబర్ 5వ తేదీన విద్యార్థులు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని పేర్కొన్నారు. మొక్కలు నాటే క్రమంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందే ఉంటుంది'