హైదరాబాద్ వనస్థలిపురంలోని లిటిల్ ల్యాంబ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని క్రైస్తవులు అధిక సంఖ్యలో చర్చిలో పాల్గొన్నారు. ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వివిధ మతాల ప్రజలు కూడా హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీతో సీఎం భేటీ