ETV Bharat / state

'విలీన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే పీవీకి అసలైన నివాళి'

సెప్టెంబర్​ 17న హైదరాబాద్ సంస్థానం విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. విలీన పోరాటాల్లో పీవీ కీలక పాత్ర పోషించారని, ఆ చరిత్రను కేసీఆర్ సర్కార్ గుర్తించాలని కోరారు.

'వీలీన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే పీవీకి అసలైన నివాళి'

author img

By

Published : Sep 9, 2020, 9:32 PM IST

మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంత్యుత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే పివీ నరసింహారావుకు అసలైన నివాళి అర్పించినట్లు అని నిరంజన్ తెలిపారు. అప్పుడే పీవీ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

వందేమాతరంలో చురుగ్గా..

పీవీ జీవిత తొలి దశలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. నిజాం సర్కార్, రజాకర్ల వ్యతిరేక పొరాటాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో క్యాంపులు నిర్వహించిన పీవీ ఘన చరిత్రను గుర్తించి గౌరవించాలని కేసీఆర్​ సర్కార్​ను కోరారు.

ఆయనది కీలక పాత్ర..

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అవడంలో పీవీ కీలక పాత్ర పోషించినట్లు నిరంజన్ వివరించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించి తమ చిత్తశుద్ధిని, నిజాయితీని రాష్ట్ర ప్రభుత్వం చాటుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి : కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.