తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావును తోటి న్యాయవాదులు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన న్యాయవాది బాలరాజును ఏపీ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు... బాలరాజు గౌడ్‌ను సన్మానించారు.
శ్రీరంగరావు కుటుంబం ఉద్యమాల చరిత్ర గలదని...అలాగే శ్రీరంగరావు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగరావును టీఎస్ఈఆర్సీ ఛైర్మన్ గా నియమించి సముచితమైన స్థానం కల్పించారన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని శ్రీరంగరావును తోటి న్యాయవాదులు కోరారు.
'తన్నీరు శ్రీరంగరావు, బాలరాజు గౌడ్‌కు ఘనంగా సన్మానం' - తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావు, ఏపీ ప్రభుత్వ ప్లీడర్‌గా నియామకమైన బాలరాజు గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ నాంపల్లిలో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులైన తన్నీరు శ్రీరంగరావును తోటి న్యాయవాదులు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన న్యాయవాది బాలరాజును ఏపీ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు... బాలరాజు గౌడ్‌ను సన్మానించారు.
శ్రీరంగరావు కుటుంబం ఉద్యమాల చరిత్ర గలదని...అలాగే శ్రీరంగరావు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరంగరావును టీఎస్ఈఆర్సీ ఛైర్మన్ గా నియమించి సముచితమైన స్థానం కల్పించారన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని శ్రీరంగరావును తోటి న్యాయవాదులు కోరారు.
TAGGED:
Grand felicitation programme