ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆటపాటలతో ఆహుతులను అలరించారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గిరిజనుల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం గురుకుల సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి జాతి ఉందంటే అది గిరిజన జాతి మాత్రమేనని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవంతో పాటు సమక్క సారలమ్మ జాతర, నాగోబా జాతర, కుమురం భీం, సేవ్‌లాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : తుగ్లక్ తరహాలో కేసీఆర్ పాలన: వివేక్