ETV Bharat / state

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు స్వతంత్రులు నామినేషన్లు వేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతోపాటు... ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం, నామినేషన్‌ కార్యక్రమాల్లో ప్రధాన నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు.

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం
కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం
author img

By

Published : Feb 20, 2021, 8:20 PM IST

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

రాష్ట్రంలో మార్చి 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ 14 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 37 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో తెరాస తరఫున పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా... ఖమ్మంలో ప్రచారసభ నిర్వహించారు. అంతకముందు తల్లాడ నుంచు కల్లూరు వరకు పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. బహిరంగసభలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌... కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పువ్వాడ అజయ్‌ ప్రజలను కోరారు.

రాంచందర్​రావు నామపత్రాలు దాఖలు

భాజపా తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావు... పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. అంతకు ముందు అలంపూర్‌ జోగులాంబ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జాతీయ నాయకురాలు డీకే అరుణతో కలిసి... అమ్మవారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం హైదరాబాద్‌లో రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు అందజేశారు.

నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ హైదరాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఎల్బీస్టేడియం నుంచి తన మద్దతుదారులతో ఆయన ర్యాలీగా వెళ్లారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని... నాగేశ్వర్‌కు మద్దతు తెలిపారు. అనంతరం లిబర్టీలోని జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో నాగేశ్వర్‌ నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగిన హైకోర్టు న్యాయవాది మహమూద్ అలీ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా సాంకేతిక విద్యా అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్ మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఓట్ల అభ్యర్థన

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి... మహబూబాద్, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వికారాబాద్‌లో జిల్లా ఎన్నికల అధికారి పౌసుమి బసు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. వికారాబాద్‌లో 7 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తెరాస తర్జనభర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.