ETV Bharat / state

జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మెుదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ పట్టభద్రులను కోరుతున్నారు.

జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

author img

By

Published : Feb 27, 2021, 5:12 AM IST

జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నారాయణగూడలో భాజపా లీగల్​సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. రాంచందర్‌రావు గెలుపుకోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృష్టి చేయాలని సూచించారు. ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని... భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన బస్సు యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెరాసకు పోటీ చేసే అర్హత లేదు..

పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపిస్తే... నిరుద్యోగుల తరఫున పోరాడతానని హైదరాబాద్‌-రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తెదేపా అభ్యర్థి ఎల్​. రమణ తెలిపారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.... లక్డీకాపుల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక సమావేశం నిర్వహించింది. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తెరాసకు లేదని ఆరోపించింది.

ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వండి..

వరంగల్ గ్రామీణ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లిలో.... కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. మెుదటి ప్రాధాన్యత ఓటు వేసి రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. నల్గొండ -వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న రాణిరుద్రమను గెలిపించాలని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కోరారు. ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.