గతేడాది మార్చి చివరి వారం నుంచి ఆగిన విమానాల రాకపోకలు చాలాకాలం పాటు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొవిడ్ ప్రభావం(Corona effect on air passengers) క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విమానాల రాకపోకలు(Air Passenger Statistics) నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. స్వదేశీ విమానాలు కొంత ముందుగా పునరుద్ధరణ జరిగినప్పటికీ... విదేశీ విమానాల రాకపోకలు ఆయాదేశాల పరస్పర ఒప్పందం మేరకు కొనసాగుతున్నాయి.
ప్రయాణికుల గణాంకాలు
ఇటీవల విమాన ప్రయాణికుల సంఖ్య(Air Passenger Statistics) గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గతేడాది ఆగస్టులో కేవలం 61.64లక్షల మంది ప్రయాణించగా... ఈసారి ఏకంగా రెట్టింపునకు మించి 1 కోటి 42లక్షల మంది ప్రయాణించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన వివరాలను పరిశీలించినట్లయితే కరోనా కారణంగా... 2020 ఆగస్టులో విదేశాలకు 5,86,693 మంది ప్రయాణించగా... ఈసారి 12,85,811 మంది(Air Passenger Statistics) ప్రయాణించారు. అదేవిధంగా గత ఆగస్టులో దేశీయంగా 55,77,737 మంది ప్రయాణించారు. ఈ ఆగస్టులో రెట్టింపు సంఖ్యలో అనగా 1,29,72,847 మంది ప్రయాణం చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రయాణించిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 16,91,160 మంది కాగా... ఈసారి ఐదు నెలల్లో 44,72,869 మంది ప్రయాణించారు. గతేడాది ఐదు నెలల్లో దేశీయ, విదేశీ ప్రయాణికుల సంఖ్య కలిపి 1,58,54,222 మంది ఉండగా... ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఏకంగా 4,82,23,282 మంది ఉన్నారు.
విమాన రాకపోకల వివరాలు
ఈ ఏడాది ఆగస్టులో విమానాల రాకపోకల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది ఆగస్టులో విదేశీ విమానాలు 10,300 ట్రిప్పులు రాకపోకలు సాగించగా... ఈసారి అంతర్జాతీయ విమాన రాకపోకలు 15,087 ట్రిప్పులు ప్రయాణించాయి. ఏకంగా 46.5శాతం అధికంగా ప్రయాణించాయి. గతేడాది దేశీయంగా 64,593 ట్రిప్పుల రాకపోకలు సాగగా... ఈసారి ఏకంగా 1,22,789 ట్రిప్పులు ప్రయాణించాయి. అనగా 90.1శాతం ఎక్కువ రాకపోకలు సాగించాయి. ఇక దేశీయ, విదేశీ విమానాలు గతేడాది ఆగస్టులో కేవలం 74,893ట్రిప్పులు కాగా... ఈ ఆగస్టులో 1,37,876 ట్రిప్పులు జరిగాయి. అంటే ఏకంగా 84.1శాతం అధికమని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,22,518 ట్రిప్పులు కాగా... ఈ ఏడాది 5,52,969 ట్రిప్పులు విమానాలు రాకపోకలు సాగించాయి.
సరుకు రవాణాలో వృద్ధి
విమానాల ద్వారా సరుకు రవాణా కూడా ఆగస్టు నెలలో పెరిగినట్లు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఆగస్టులో 2,04,247 టన్నుల సరుకు రవాణా కాగా... ఈ ఏడాది ఆగస్టులో 2,64,509 టన్నుల సరుకు రవాణా జరిగింది. అంటే కేవలం 29శాతం అధికంగా సరుకు రవాణా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 7,02,154 టన్నుల సరుకు రవాణా కాగా... ఈ ఏడాది అదే ఐదు నెలల్లో 12,62,220టన్నుల సరుకు రవాణా చేశారు. 79శాతం వృద్ది నమోదైంది. గతేడాది ఆగస్టులో కేవలం 16,506 విమానాలు రాకపోకలు జరగగా... ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 23,230 విమానాలు రాకపోకలు సాగించాయి.
ఇదీ చదవండి: tamilisai soundararajan: పరువునష్టం కేసులో గవర్నర్ తమిళిసైకి ఊరట