ETV Bharat / state

క్రమేపీ పెరుగుతోంది: మెట్రో ప్రయాణానికే హైదరాబాదీల మొగ్గు - hyderabad metro updates

మెట్రో ప్రయాణంలో నేరు మార్గానికే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. రైళ్లు మారి గమ్యస్థానాలు చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. నాగోల్‌-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గాలతో పోలిస్తే మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండడమే ఇందుకు నిదర్శనం. మెట్రోలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం.. ప్రయాణికుల ఆదరణ పెరగడానికి కారణమవుతోంది. తొలివారంలో ఖాళీగా కన్పించగా ప్రస్తుతం సందడి కన్పిస్తోంది.

hyderabad metro
hyderabad metro
author img

By

Published : Sep 27, 2020, 8:35 AM IST

హైదరాబాద్​లో ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా ఆర్టీసీ సిటీ సర్వీసులు పూర్తిస్థాయిలో నడవడం లేదు. ఇప్పటికీ చాలామంది వ్యక్తిగత వాహనాల్లోనే వెళుతుండడం వల్ల రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. వాహనాలపై వెళ్లడం ఇష్టంలేని వారు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. వీరంతా మెట్రో స్మార్ట్‌కార్డు, క్యూఆర్‌కోడ్‌ టికెటింగ్‌ వాడుతున్నారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించేందుకు చెన్నైలో మెట్రో పునఃప్రారంభం తర్వాత క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ ఛార్జీలపై 20 శాతం రాయితీని ఇచ్చారు. మన వద్ద క్యూఆర్‌కోడ్‌ టికెట్లపై ఎలాంటి రాయితీ లేదు.

మెట్రోలో ప్రయాణాలు పూర్వస్థితికి రావాలంటే మరికొన్ని నెలలు పడుతుందంటున్నారు. అప్పుడూ 75 శాతానికి మించకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. హైదరాబాద్‌, బెంగళూరులో కొవిడ్‌కు ముందు సగటున నిత్యం 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు యాభై వేలకు అటుఇటుగా ఉంటున్నాయి. విదేశాల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితినే అక్కడి మెట్రోలు, సబ్‌వేలు ఎదుర్కొ న్నాయి.

మరికొన్ని నెలలు..

న్యూయార్క్‌లో కొవిడ్‌కు ముందు 55.8 లక్షల ప్రయాణికుల రాకపోకలు ఉంటే... ఏప్రిల్‌-మే మాసంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు మెట్రో ఎక్కేవారు 4.46 లక్షలకు తగ్గారు. ఆగస్టు నాటికి 41.85 లక్షలకు ప్రయాణికుల సంఖ్య చేరింది.

మెట్రోలో దిల్‌సుఖ్‌నగర్‌ వాసి బేగంపేట వెళ్లాలంటే అమీర్‌పేటలో రైలు మారాల్సి ఉంటుంది. నారాయణగూడలో మెట్రో ఎక్కిన ప్రయాణికుడు పంజాగుట్టకు రావాలంటే ఎంజీబీఎస్‌లో మారాలి. సాధారణ రోజుల్లో ఇలా మారే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రైలు మారకుండా, నేరుగా గమ్యస్థానాలకు చేరేందుకు మాత్రమే మొగ్గుచూపుతున్నారు. మారే క్రమంలో ఎక్కువ తాకాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు భావిస్తున్నారు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రో అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిని హెచ్చరిస్తున్నారు. మియాపూర్‌ స్టేషన్‌ ప్రవేశ మార్గం, ఎస్కలేటర్‌ వద్ద ప్రయాణికుల రద్దీ మారడానికి ఇష్టపడడం లేదు

ఇదీ చదవండి : 'వ్యాక్సిన్​ కోసం భారత్​ రూ.80వేల కోట్లు ఖర్చుచేయగలదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.