ETV Bharat / state

Govt Land Alloted To TRS: తెరాస కార్యాలయానికి భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం - TRS OFFICE

Govt Land Alloted To TRS: తెరాస హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. నగరంలోని బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో 4,935 చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ భూమిని తెరాసకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Govt Land Alloted To TRS
Govt Land Alloted To TRS
author img

By

Published : May 12, 2022, 5:01 AM IST

Govt Land Alloted To TRS: తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్​లో భూమిని కేటాయించింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు12లోని ఎన్​బీటీ నగర్​లో 4,935 చదరపు గజాల ప్రభుత్వ భూమిని తెరాసకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెరాస కార్యాలయాలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. హైదరాబాద్​లో తెరాస ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ... జిల్లా కార్యాలయం కూడా నిర్మించాలని పార్టీ నాయకత్వం కొంత కాలంగా ప్రయత్నాల్లో ఉంది. ఈనెల 9న జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు 10 వ తేదీన సీసీఎల్ఏ సిఫార్సు చేయగా ఇవాళ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​.. ఓకే చేశారా.. ఇక అంతే.!

'తాజ్​ మహల్​ మా కుటుంబానిదే.. డాక్యుమెంట్స్​ పక్కాగా ఉన్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.