pm modi at raj bhavan: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భాజపా విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సభ అనంతరం మోదీ నేరుగా రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.

మోదీ నేడు రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి వంశీయులు పలువురు మోదీని కలవనున్నారు. పలు ప్రాంతాల్లో స్థిరపడిన తమ వంశీయులంతా రేపు భీమవరం రానున్నారని విజయనగరానికి చెందిన అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు మనవడు శ్రీరామరాజు తెలిపారు. విశాఖ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రధానిని కోరనున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చూడండి..
'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుంది..'
'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు భాజపా శకం.. విశ్వగురుగా భారత్'