హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు తలమాణికమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మెట్రో రైల్‌లో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణించారు. అమీర్‌పేట నుంచి నాగోల్...నాగోల్ నుంచి బేగంపేట వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. మార్గ మధ్యలో ఉప్పల్ మెట్రో డిపోను పరిశీలించారు. మెట్రో ప్రారంభానికి ముందు ఒకసారి, ఇప్పుడు మరోసారి మెుత్తం రెండు సార్లు మెట్రోలో ప్రయాణించినట్లు నరసింహన్ వెల్లడించారు.
ఇవీ చూడండి : '866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన గోదావరి