గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
పింఛన్లు
- కేవలం తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు.
- ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే.
- షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు.
- తెలంగాణ ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుంది.
- వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఫలితంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా ఫించన్లు అందనున్నాయి.
విద్యార్థులు, యువత
- విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోంది.
- దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది.
- యువత ఉపాధి కోసం నడుపుకునే ఆటోలు, రైతుల ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.
సంక్షేమ రంగం
- పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.
- హోంగార్డులకు దేశంలో ఎక్కడాలేనంత వేతనం తెలంగాణలోనే అందుతుంది.
- ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్స్ అందిస్తోంది.
- సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోంది.
- సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబరు వన్‌గా నిలబడింది.
విద్యుత్ రంగం
- విద్యుత్ రంగంలో తెలంగాణ అనితర సాధ్యమైన విజయాలు సాధించింది.
- ఉమ్మడి ఏపీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు.
- తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13,168 మెగావాట్లు వచ్చింది.
- ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ డిమాండ్ ఉన్నా లోటు, కోత లేకుండా సరఫరా చేస్తున్నాం.
- రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
- రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది
వ్యవసాయం
- రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నాం.
- కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌తో చర్యలు.
- 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు భూమినంతా సాగులోకి తెస్తున్నారు.
- 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు
నీటిపారుదల రంగం
- కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సమగ్ర జలవిధానం అమలు.
- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం.
- మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది.
- ప్రపంచంలో అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది.
- త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి.
- 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని ప్రభుత్వం మంజూరు చేసింది.
- త్వరలోనే సీతమ్మ బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయి.
- యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు.
- ఈ యాసంగిలో వరి సాగు 38,19,413 ఎకరాలు నమోదు.
- యాసంగిలో వరిసాగు 123.5 శాతం పెరిగింది.
రైతు బంధు
- రైతుబంధు దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శం.
- రైతుబంధు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో రూ.10 వేలు అందిస్తున్నాం.
- తెలంగాణ స్ఫూర్తితో వివిధ రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు అమలు చేస్తున్నాయి.
- రైతుబంధు దేశ రైతు తలరాత మార్చే పురోగామిక మలుపు.
- వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐరాస ప్రకటించింది.
- ఐరాస ప్రకటన రాష్ట్రానికి, రైతులకు గర్వకారణం
రైతు బీమా
- రైతు బీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు పది రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నాం.
- వ్యవసాయశాఖ బలోపేతం కోసం ప్రతి 5 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం.
- ఇకపై రైతు సమన్వయ సమితులు...రైతుబంధు సమితులుగా వ్యవహరిస్తాయి.
- విత్తనం వేసిన దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రై.బ.స.లే కీలకంగా వ్యవహరిస్తాయి
మిషన్ భగీరథ
- మిషన్ భగీరథతో రాష్ట్రంలోని అన్ని అవాస ప్రాంతాలకు ప్రతిరోజూ సురక్షిత మంచినీరు.
- మిషన్ భగీరథను 11 రాష్ట్రాలు అధ్యయనం చేశాయి.
- దేశవ్యాప్తంగా మిషన్ భగీరథను అమలు చేయడం మంచిదని నీతిఆయోగ్ సిఫారసు చేయడం మనకు తగ్గిన ప్రసంశ.
ప్రజారోగ్యం
- ప్రజా వైద్యం కోసం మందులు కొనుగోలు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు మూడింతలు పెంచాం.
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే 40 ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు.
- 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూంలు ఏర్పాటు చేశాం.
- గర్భిణులను ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు 200 అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం.
- మరణించిన వారిని ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు 50 పరమపద వాహనాలు ఏర్పాటు చేశాం.
- 84 పీహెచ్‌సీలు ఎస్.క్యూ.ఎ.ఎస్ స్థాయిని దక్కించుకున్నాయి.
- న్యూ బార్న్ కేర్ సెంటర్లను 42కి పెంచేందుకు నిర్ణయం.
- 4 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి మెడికల్ కళాశాలల సంఖ్యను 9కి పెంచాం.
- కేసీఆర్ కిట్ పథకం వల్ల మాతాశిశు సంరక్షణ పెరిగింది.
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్ల సంఖ్య 20 శాతం పెరిగింది.
- కంటి వెలుగుతో ప్రపంచంలోనే అతిభారీస్థాయిలో ఐ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ అరుదైన రికార్డు సాధించింది.
- కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41 మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించాం.
- చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణకు నిర్ణయం.
- తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు త్వరలోనే కార్యాచరణ ప్రకటన.
- బస్తీ దవాఖానాల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం.
- హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు.
- ప్రభుత్వ విభాగాల పునర్వవస్థీకరణను అత్యంత శాస్త్రీయంగా చేపట్టాం.
పల్లెల, పట్టణ అభివృద్ధి:
- కొత్త గ్రామీణ, పట్టణ విధానాల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం పెంపు.
- పల్లెల అభివృద్ధి కోసం కలెక్టర్లకు ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఇచ్చాం.
- ప్రభుత్వ, మంత్రులకు ఉండే అధికారాలు తొలగించి కలెక్టర్లకు ధారాదత్తం చేశాం..
- ప్రతినెల గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు.
- కొత్త భూపరిపాలన విధానానికి త్వరలోనే శ్రీకారం.
పారిశ్రామిక రంగం
- టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో 12,427 పరిశ్రమలకు అనుమతులు.
- 2 లక్షల 4 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
- 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
ఐటీ రంగం
- 2013-14లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57వేల కోట్లు.
- 2018-19 నాటికి ఐటీ ఎగుమతుల విలువ లక్షా 9 వేల కోట్లకు పెరిగింది.
- రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తున్నాం.
- శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
- తెలంగాణలో 6 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
- దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం తెలంగాణలోనే ఉన్నాయి.
- త్వరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.
ఆర్థిక పరిస్థితి
- దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది.
- పటిష్టమైన పరిపాలనా విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుంది.
- దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉంది.
- తెలంగాణ ఆ దుస్థితిలో లేకపోవడం గుడ్డిలో మెల్ల అన్నట్లు కనిపించే అంశం.
- ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్ధికాంశాల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని నిర్ణయం.